మాజీ ఆర్మీ అధికారి అరెస్టు
ముంబయి: మాలెగావ్ పేలుళ్ల కేసులో మాజీ మేజర్ రమేష్ ఉపాధ్యాయ్, భోపాల్ ప్రింటింగ్ ప్రెస్ ఉద్యోగి సమీర్ కులకర్ణిలను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన పేలుళ్లలో మాలెగావ్ లో ఆరుగురు మరణించారు. ఈ కేసులో మధ్యప్రదేశ్ లోని పంచమర్హిలో పనిచేస్తున్న సైనికాధికారి ఒకరిని ప్రశ్నించేందుకు మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధ బృందం (ఎటిఎస్) మిలిటరీ అనుమతిని కోరింది.
సైన్యంలో నిఘా విభాగంలో పనిచేసిన ఉపాధ్యాయ్ మాలెగావ్ పేలుళ్ల కేసులో అరెస్టయిన సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ కు, ఆమె ఇద్దరు అనుచరులకు బాంబుల తయారీలో శిక్షణ ఇచ్చినట్లు ఎటిఎస్ వర్గాలు చెప్పాయి. ఉపాధ్యాయ్ ను నిజానికి ఆదివారంనాడు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను, కులకర్ణిని బుధవారం నాసిక్ కోర్టు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఉపాధ్యాయ్ కొంత కాలం బిజెపి ముంబయి శాఖ మాజీ సైనికుల విభాగంలో పని చేశాడు. అయితే బిజెపి అగ్రనాయకత్వం ఆయనను తొలగించినట్లు సమాచారం. ప్రజ్ఞా, శ్యాంలాల్ సాహు, శివనారాయణ్ సింగ్ లను ప్రశ్నించినప్పుడు ఉపాధ్యాయ్ పాత్ర వెలుగులోకి వచ్చింది ఈ ముగ్గురిని పోలీసులు నవంబర్ 3వ తేదీ వరకు తమ రిమాండులోకి తీసుకున్నారు. కులకర్ణికి చాణక్య అనే పేరు కూడా ఉంది. రెండేళ్ల క్రితం మహారాష్ట్ర నుంచి భోపాల్ కు వచ్చిన కులకర్ణి అభినవ్ భారత్ సంస్థాన్ అనే సంస్థను ఏర్పాటు చేశాడు.












Click it and Unblock the Notifications
