సమ్మె విరమణకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్: సమ్మెను విరమించాలని రాష్ట్ర హైకోర్టు ఉపాధ్యాయులను ఆదేశించింది. సమ్మెను వెంటనే విరమించుకోవాలని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని హైకోర్టు ఉపాధ్యాయులను ఆదేశించింది. ఉపాధ్యాయుల సమ్మెపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. తాము గత 20 ఏళ్లుగా సమస్యలతో సతమతం అవుతున్నామని, నాలుగేళ్లుగా బదిలీలు లేక ఇబ్బంది పడుతున్నామని ఐక్య ఉపాధ్యాయ కార్యాచరణ సమితి (జాక్టో) హైకోర్టుకు తెలియజేసింది. సమ్మెను విరమించుకోకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హైకోర్టు తెలియజేసింది.
సమ్మె విరమించి ప్రభుత్వంతో మాట్లాడుకోవచ్చు కదా అని హైకోర్టు అన్నది. అయితే ప్రభుత్వం అకస్మాత్తుగా చర్చలను నిలిపేసిందని జాక్టో హైకోర్టుకు తెలియజేసింది. ఉపాధ్యాయులతో చర్చలు జరిపి సమ్మె విరమించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. అయితే తాము సమ్మెను కొనసాగిస్తామని జాక్టో నాయకులు తెలియజేశారు. సమ్మె విరమించాలని హైకోర్టు సూచన మాత్రమే చేసిందని, ఆదేశించలేదని వారంటున్నారు.












Click it and Unblock the Notifications
