చిరంజీవిపై వైయస్ పరోక్ష వ్యాఖ్య

YS Rajasekhar Reddy
ఏలూరు: ప్రభుత్వాలు ఏమీ చేయలేదని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వారు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించారు. చింతలపూడి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కామవరపు కోటలో ఇందిరమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. గత 9 ఏళ్ల తెలుగుదేశం పాలనకు, తమ నాలుగున్నరేళ్ల పాలనకు మధ్య గల తేడాను గుర్తించాలని ఆయన ప్రజలను కోరారు. తెలుగుదేశం తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు. తాము ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేశామని ఆయన చెప్పారు. మరిన్ని మేళ్లు చేయడానికి, మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయడానికి తమకు తిరిగి అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. ప్రతినిత్యం ప్రజల మేలు కోసం ఆలోచించే ప్రభుత్వం తమదని యన అన్నారు.

2003లో రైతులు విలవిలలాడినా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన అన్నారు. తాము రైతుల భూములకు సాగు నీరందించడానికి 17000 కోట్ల రూపాయలతో పోలవరం ప్రాజెక్టును ప్రారంభించామని, అయితే ప్రతిపక్షాలు దానికి అడ్డం పడ్డాయని, ఇతర రాష్ట్రాల్లో ప్రభుత్వం చేసే మంచి పనులకు ప్రతిపక్షాల నుంచి సహకారం ఉంటుందని, ఇక్కడి ప్రతిపక్షాలు మాత్రం అడుగడుగునా అడ్డం పడుతున్నాయని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు వామపక్షాలు, తెలంగాణ రాష్ట్ర సమితి అడ్డుపడ్డాయని, దాని వల్ల ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగిందని ఆయన అన్నారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని ఏ శక్తి కూడా అడ్డుకోలేదని ఆయన అన్నారు. తాము చేపట్టిన రెండు రూపాయల కిలో బియ్యం పథకం, రైతులకు ఉచిత విద్యుత్తు, ఆరోగ్య శ్రీ వంటి పథకాలను ఆయన వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+