విజయవాడ-గుంటూరు జామ్ జామ్
విజయవాడ: తెలుగుదేశం పార్టీ " యువగర్జన" కు వెళ్లే వాహనాలు అన్నీ విజయవాడ మీదుగానే వెళుతుండటంతో విజయవాడ వాహనాలమయంగా మారింది. వివిధ జిల్లాలనుంచి 5వ నెంబరు, 9వ నెంబరు జాతీయ రహదారులపై వచ్చే వాహనాలు విజయవాడ కనకదుర్గ వారధి మీదుగా గర్జన ప్రాంగణానికి చేరుకుంటున్నాయి.
వందలసంఖ్యలో ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో కార్యకర్తలు నందమూరి అభిమానులు తరలివెళుతున్నారు. హైదరాబాద్, ఇతర తెలంగాణా జిల్లాలనుంచి వచ్చే వాహనాలు, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలనుంచి వచ్చే వాహనాలతో రోడ్లన్నీ కోలాహలంగా మారాయి. ప్రత్యేక రైళ్లలో విజయవాడ వచ్చినవారుకూడా అక్కడినుంచి బస్సుల్లో గుంటూరు వెళుతున్నారు.












Click it and Unblock the Notifications
