"ఓటు పోతే పథకాలూ పోయినట్లే"- SIRతో కేంద్రం భారీ కుట్ర - రాహుల్ ఫైర్ ..!
ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్ ) లో దాదాపు 13 కోట్ల ఓట్లు తొలగించిన వ్యవహారంలో ఎన్నికల కమిషన్ తో సమానంగా విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర ప్రభుత్వం .. తాజాగా మరో సంచలన నిర్ణయం ప్రకటించింది. సంక్షేమ పథకాల కోసం ఆధార్ కార్డు కాకుండా ఓటరు కార్డునే ప్రామాణికంగా తీసుకోబోతున్నట్లు కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎస్ఐఆర్ ద్వారా చేస్తున్న కుట్రను అర్దం చేసుకోవాలంటూ విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఇవాళ ట్వీట్ చేశారు.
పథకాల ప్రయోజనాలు ఇకపై ఆధార్ ద్వారా కాకుండా, ఓటర్ ఐడీ ద్వారా నిర్ణయిస్తామన్న కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ వీడియోను షేర్ చేసిన రాహుల్ గాందీ.. .ఈ కుట్ర చాలా లోతుగా పాతుకుపోయిందనిు, దీన్ని అర్థం చేసుకోవాలని ప్రజల్ని కోరారు. ఎస్ఐఆర్ ముసుగులో, లక్షలాది పేర్లను ఓటర్ల జాబితాల నుండి తొలగిస్తున్నారని, దీన్ని ఆపకపోతే, ఇంకా ఎన్నో పేర్లను తొలగిస్తారన్నారు.
బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నవారి పేర్లను ఇలా టార్గెట్ చేసుకుంటున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితాలు నిష్పక్షపాత ఎన్నికల సంఘం చేతిలో ఉండాలి-కానీ ఇప్పుడు అవి మోదీ ప్రభుత్వ ఉద్యోగి జ్ఞానేష్ కుమార్ చేతిలో ఉన్నాయన్నారు. ఓట్ల దొంగతనంలో బీజేపీతో ఆయన కుమ్మక్కైన తీరును తాము ఆధారాలతో సహా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామన్నారు.

ఎల్లప్పుడూ బీజేపీకే మెజారిటీ ఉండేలా ఒక జాబితాను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పుడు అదే జాబితా మీకు పథకాల ప్రయోజనాలు అందుతాయో లేదో నిర్ణయిస్తుందన్నారు. నిన్న బీజేపీని గద్దె దించాలని నిర్ణయించుకున్న వారి పేర్లను ప్రత్యేకంగా ఎంపిక చేసి జాబితా నుండి తొలగిస్తారని రాహుల్ తెలిపారు. పేరు తొలగిస్తే ఓటు పోయినట్లే. ఓటు పోతే హక్కులు పోయినట్లే అన్నారు. అలాగే, మీరు హైజాక్ చేసిన ప్రజాస్వామ్యంలో అదృశ్య పౌరులుగా మారిపోతారన్నారు. ఇక్కడ ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకోరు, ప్రభుత్వమే తన మనుషులను ఎన్నుకుంటుందన్నారు. ఈరోజు పంచాయతీ రాజ్ పథకాలు, రేపు, రేషన్లా? పెన్షన్లా? ఎంజీఎన్ఆర్ఈజీఏనా? గృహవసతి? స్కాలర్‌షిప్‌లా? రిజర్వేషన్లా? అని ప్రశ్నించారు. ఇది ఎన్నికలలో గెలవడానికి చేసే రాజకీయం కాదని, ఎన్నికలను దొంగిలించడానికి చేసిన ఒక ఏర్పాటు, అధికారాన్ని అంటిపెట్టుకుని ఉండటానికి వేసిన శాశ్వతమైన ఏర్పాటే అన్నారు. ఓటు వేయడం మీ హక్కు, షరతు కాదన్నారు. ఒక పేద వ్యక్తి పెన్షన్‌ను వారి ఓటర్ కార్డుకు బానిసగా చేయలేరన్నారు. ఇది కేవలం ఓట్ల దొంగతనం కాదని, ఇది హక్కుల దొంగతనం అన్నారు. తాము దీనిని జరగనివ్వబోని రాహుల్ హెచ్చరించారు.













Click it and Unblock the Notifications
