వైయస్ కు చిరు ఘరానా జవాబు

తాను మొగల్తూరులో కొద్ది కాలం మాత్రమే ఉన్నానని, తన తండ్రి ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలు తిరిగానని, తన బాధ్యత మొగల్తూరుకే పరిమితం కాదని, రాష్ట్రం బాధ్యత తనపై ఉందని ఆయన చెప్పారు. తెలంగాణపై తమ వైఖరి స్పష్టంగానే ఉందని ఆయన చెప్పారు. బిజెపితో సహా ఎవరు అధికారంలోకి వచ్చినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము సహకరిస్తామని ఆయన చెప్పారు. బిజెపి అధినేత ఎల్.కె. అద్వానీ తనకు శుభాకాంక్షలు మాత్రమే చెప్పారని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీయేలో చేరుతామా లేదా అనేది ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ప్రజారాజ్యం పార్టీకి వివిధ వేషధారణల్లో పిల్లలు వచ్చి చిరంజీవిని కలిశారు. తాము అధికారంలోకి వస్తే పిల్లలకు తగిన పథకాలు రూపొందిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications