కోల్‌కత్తా: మాజీ కేంద్రమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ నేత అజిత్‌పాంజా కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. గతనెల 25న ఆరోగ్యం బాగా క్షీణించటంతో కోల్‌కత్తాలోని పీర్‌లెస్ ఆసుపత్రిలో చేర్చారు. 48 గంటలుగా ఆయన కృత్రిమశ్వాస మీదే ఉన్నారు. గురువారం రాత్రి పరిస్థితి విషమించి ఆయన మృతి చెందారు. ఈ విషయం తెలియగానే తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. 72 ఏళ్ల పాంజా కాంగ్రెస్ తరపున శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా గెలిచారు. రాజీవ్‌గాంధీ, పీవీ నరసింహారావు హయాంలో మంత్రిగా పనిచేశారు. 2001లో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రిగా పనిచేశారు.