ఛత్తీస్ ఘడ్ పోలింగ్ లో చెలరేగిన హింస
రాయపూర్: హింసాత్మక సంఘటనల మధ్య శుక్రవారం ఛత్తీస్ ఘడ్ శాసనసభ ఎన్నికల తొలి విడత పోలింగ్ జరిగింది. తొలి విడత 39 నియోజకవర్గాల్లో పోలింగు జరిగింది. దాదాపు 15 చోట్ల కాల్పులు జరిగాయి. పలు చోట్ల మావోయిస్టులు హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో పోలింగ్ తక్కువగా జరిగింది. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న దంతెవాడ జిల్లాలో నలుగురు భద్రతా సిబ్బంది అధికారులు గాయపడ్డారు. దంతెవాడ జిల్లాలోని గోర్ఖా సమీపంలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరు అధికారులున్నారు.
అదే జిల్లాలోని చింతల్నార్ లో మరో పేలుడు సంభవించింది. రెండు ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను జగదల్పూరు నియోజకవర్గంలో ఎత్తుకుపోయారు. పది జిల్లాలోని 39 శాసనసభా నియోజకవర్గాల్లో అసాధారణమైన భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ జరిగింది. మధ్యాహ్నానికి 25 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. ఈ 39 నియోజకవర్గాల్లో 379 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తో పాటు ప్రతిపక్ష నాయకుడు మహేంద్ర కర్మ, స్పీకర్ ప్రేమ్ ప్రకాష్ పాండే, పలువురు మంత్రులు శుక్రవారం పోలింగ్ జరిగిన స్థానాల్లో పోటీలో ఉన్నారు. మిగతా 51 సీట్లకు ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరుగుతుంది.












Click it and Unblock the Notifications