సూరికి సంబంధం లేదు: ఓంప్రకాష్
అనంతపురం: మొద్దు శీను హత్యతో పరిటాల రవి హత్యకేసులో నిందితుడు మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరికి సంబంధం లేదని శీను హత్య కేసులో నిందితుడు ఓం ప్రకాష్ చెప్పాడు. తగరకుంట ప్రభాకర్, భానుకోట కిష్టప్పలను చంపినందుకే తాను మొద్దు శీనును చంపినట్లు ఆయన చెప్పాడు. ఓంప్రకాష్ ను పోలీసులు శుక్రవారం పెనుకొండ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అతను మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు. మొద్దు శీను హత్యతో తనకు తప్ప మరెవరికీ సంబంధం లేదని అతను అన్నాడు.
రాష్ట్రంలో బిసిలను అణగదొక్కుతున్నారని అతను అభిప్రాయపడ్డాడు. ఆర్థిక మంత్రి రోశయ్య కులస్థుడు కాబట్టే పోతుల సురేష్ ను ఎన్ కౌంటర్ చేయలేదని అతను ఆరోపించాడు. ఓంప్రకాష్ పోలీసు కస్టడీ శుక్రవారంతో ముగిసింది. కంచి పీఠాధిపతినే అరెస్టుచేశారు, తానెంత అని అతను అన్నాడు. పరిటాల రవి కుటుంబమంటే తనకు అభిమానామని అతను చెప్పాడు.సూరితో గానీ, పరిటాల సునీతతో గానీ తనకు సంబంధం లేదని అతను చెప్పాడు.












Click it and Unblock the Notifications