మహారాష్ట్ర ప్రాజెక్టుల సందర్శనకు టిడిపి
నిజామాబాద్: గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులను సందర్శించేందుకు తెలుగుదేశం ప్రతినిధి బృందం బయలుదేరింది. ఎర్రబెల్లి దయాకర్ రావు తదితర నాయకులు అజంతా ఎక్స్ ప్రెస్ రైల్లో ఔరంగాబాద్ చేరుకుని అక్కడి నుంచి ప్రాజెక్టులను సందర్శించేందుకు బయలుదేరారు. బాబ్లీ ప్రాజెక్టుపైన నిర్మిస్తున్న ప్రాజెక్టులను కొన్నింటిని వారు చూశారు. మహారాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోకపోతే మంగళవారంనాటికి బాబ్లీ ప్రాజెక్టు చేరుకుంటారు.
మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్నబాబ్లీతో పాటు 11 ప్రాజెక్టులను ఆపకపోతే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చుక్క నీరు రాదని ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఈ ప్రాజెక్టులను మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ ప్రాజెక్టులను ఆపించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications