వైయస్ ధనయజ్ఞం సక్సెస్: బాబు

మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న బాబ్లీతో పాటు 11 ప్రాజెక్టులను అపించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని, కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి ప్రాజెక్టులను ఆపించడం లేదని ఆయన విమర్శించారు. గోదావరినదిపై మహారాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులను చేపట్టకపోతే వాటిని చూడడానికి వెళ్లిన తమ పార్టీ నాయకులను ఎందుకు అడ్డుకుంటారని ఆయన అడిగారు. తాము ప్రాజెక్టులను సందర్శించడానికి వస్తున్నట్లు తమ పార్టీ నాయకులు పోలీసులకు కూడా చెప్పారని, అయినా వారిని అడ్డగిస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు నష్టం చేస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కాంగ్రెసుతో పొత్తు పెట్టుకునే దిశగా వెళ్తుందనే విషయంపై ఆయన ప్రతిస్పందించారు. వామపక్షాలతో పొత్తులు కుదిరితే ఎవరు ఎటు వెళ్లినా తమకేమీ నష్టం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications