కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చేస్తోంది: కెసిఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణకు అనుకూలంగా ఢిల్లీలో నిర్ణయం తీసుకున్నట్లు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత తనతో చెప్పారని, దీనికి సంబంధించి ఐదారు రోజుల్లో మనకు అధికారికంగా ఆహ్వానం కూడా వస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చెప్పారు. తెలంగాణ ఇచ్చేస్తే మనకు కాంగ్రెస్‌తో పంచాయతీ లేదని, అన్ని పార్టీలు తెలంగాణకు సై అన్నాయని, అందుకే కాంగ్రెస్‌ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసిందని ఆయన అన్నారు. మంగళవారమిక్కడ పార్టీ కార్యాలయంలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఎ.ఎస్‌.పోశెట్టి తిరిగి తన అనచరులతో కల్సి తెరాసలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ ఆ విషయాలు చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అంశం గురించి గతకొన్ని రోజులుగా ఢిల్లీ స్థాయిలో తీవ్రంగా ఆలోచిస్తోందని తెలిపారు. జాతీయస్థాయిలో రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలోని పరిస్థితులను బేరీజు వేసుకొని రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయరాదని భావిస్తోందన్నారు. రాష్ట్రంలో ఆ పార్టీతో కల్సి పనిచేసే అవకాశం ఇతర పార్టీలకు లేదని, తెరాస ఒక్కటే ప్రత్యామ్నాయంగా కనపడుతోందని పేర్కొన్నారు. తనతోపాటు పార్టీలోని మరికొందరు నాయకులతో కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నట్లు వెల్లడించారు. తెలంగాణపై మరో పదిరోజుల్లో పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు.

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంటే తెరాసకు ఏడుశాతం అధికంగా ఓట్లు రావడం తదితర పరిణామాలు ఆ పార్టీ అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి కారణమన్నారు. ఇటు సూర్యుడు అటు ఉదయించినా ఇక తెలంగాణ ఏర్పడడం ఆగదని ఆయన అన్నారు. తెలంగాణ సంస్థ తెలంగాణ కోసం పోరాడకుండా రాజకీయం చేస్తోందని ఆయన నవ తెలంగాణ పార్టీని దుయ్యబట్టారు. ప్రరాపాలో కలవడంలేదని ఖండించడానికి కూడా ఆ పార్టీ వెనుకాడుతోందని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+