మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం
విజయనగరం: ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులకు చెందిన ఓ భారీ పేలుడు పదార్థాల డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా ప్రత్యేక పోలీసు దళాలు టేకులోవ, బిత్రటొంకి గ్రామాల మధ్యలో మావోయిస్టులకోసం జరిపిన గాలింపుల్లో ఈ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. 180 శక్తిమంతమైన గ్రెనేడ్లు, ఎలక్ట్రికల్ డిటనేటర్లు, ఎలక్ట్రికల్ వైర్లు లభ్యమయ్యాయి. ఈ డంప్ కోరాపుట్ మావోయిస్టులదిగా భావిస్తున్నారు. డంప్ స్వాధీనంతో పోలీసులు పెద్ద ముప్పు నుంచి బయటపడ్డట్లయింది. మావోయస్టులు బలమైన ఆయుధాలను కోల్పోయారని ఆ జిల్లా ఎస్పీ అన్నారు. ఇది మావోయిస్టులకు దెబ్బేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications