కెసిఆర్ ప్రకటన విచిత్రం: విహెచ్
హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) మాట్లాడటం విచిత్రంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కు,తమకు తెలియకుండా కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాణాపై కేసీఆర్‌తో చర్చిస్తుందని తాము అనుకోవటం లేదని ఆయన అన్నారు. అయితే తెలంగాణా విషయాన్ని కాంగ్రెస్ కూడా తీవ్రంగానే పరిగణిస్తోందని, ఆరు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయ్యాక దీనిపై దృష్టి పెట్టే అవకాశం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications