చిరంజీవి హీరో కాలేరు: వైయస్

YS Rajasekhar Reddy
ఒంగోలు: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సినిమాల్లో హీరో అయ్యారని, రాజకీయాల్లో హీరో అవుదామని అనుకుంటున్నారని, కానీ అది సాధ్యం కాదని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ఇతరులకు సాయం చేసే గుణం చిరంజీవికి లేదని ఆయన అన్నారు. రాజకీయాల్లో రాణించాలంటే ఇతరులకు సాయం చేసే గుణం ఉండాలని ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన జిల్లా కాంగ్రెస్ కమిటీ (డిసిసి) విస్తృత స్థాయి సమావేశంలో ఆయన సోమవారం మాట్లాడారు. తొడగొట్టడం, మీసాలు మెలేయడం చిరంజీవి మార్కు రాజకీయమా అని ఆయన ప్రశ్నించారు.

ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గానీ, ఏప్రిల్ లో గానీ రావచ్చునని, అందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు. రాజకీయ, సామాజిక కార్యకర్తలకు ప్రత్యేకత ఉండాలని, సొంత లాభం కొంత మానుకుని పొరుగువారికి తోడ్పడే గుణం ఉండాలని ఆయన అన్నారు. తమది ప్రత్యేక రాజకీయమని చిరంజీవి పదేపదే అంటున్నారని ప్రత్యేకం అంటే తొడగొట్టటమా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలు తమ అభివృద్ధి చూసి తమకే ఓటు వేయటం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. కోటి రూపాయలతో నిర్మించిన మహిళా శిశు సంక్షేమ భవనాన్ని ఆయన ప్రారంభించారు. గుండ్లకమ్మ ప్రాజెక్టును ఆయన జాతికి అంకితం చేశారు. భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+