ప్రజలకు వైయస్ ఉత్తి ముద్దులు: రోజా

ఒక మంత్రికి సంబంధించిన వారున్నందువల్లే ఆయేషా మీరా హత్య కేసును తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మరో మంత్రి భార్యపై గృహహింసకు పాల్పడ్డా ఏ చర్యలూ లేవని పేర్కొన్నారు. తమ కార్యకలాపాలకు కొమ్ముకాచే పోలీసులను ప్రభుత్వం వెనకేసుకొస్తోందన్నారు. వాకపల్లి గిరిజన మహిళలను అత్యాచారం చేసిన గ్రేహౌండ్స్ పోలీసులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని, ఇలాంటి ప్రభుత్వం మహిళలకు ఎలా న్యాయం చేస్తుందో ముఖ్యమంత్రి చెప్పాలని అని ఆమె అన్నారు.
ప్రజారాజ్యం పా ర్జీఅధినేత చిరంజీవి పరిస్థితి 'అన్నంలో రాయి తీయలేని వ్యక్తి చెరువులో రాళ్లు తీస్తానన్నట్లు'గా ఉందని రోజా వ్యాఖ్యానించారు. ఇంట్లో మహిళలకు న్యాయం చేయలేని వ్యక్తి బయటి మహిళలకేం చేస్తారని ప్రశ్నించారు. ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఆమె ఈ మేరకు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications