వైయస్ ను దోషిగా నిలబెడ్తాం: బాబు

ఆల్ ఫ్రీ బాబు అని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అనడంపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. దోపిడీని తగ్గించగలితే తాను ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు చేయడం సాధ్యమేనని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే విశాఖపట్నం అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి శాంతిభద్రతలను గాలికి వదిలేశారని, జైళ్లలో కూడా హత్యలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, వామపక్షాల కూటిమిదే విజయమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డికి వచ్చే ఎన్నికల్లో 23 శాసనసభ స్థానాలు మాత్రమే వస్తాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications