కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉప్పునూతల అసంతృప్తి
హైదరాబాద్: తెలంగాణపై శాసనసభలో చర్చకు రాకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణపై మాట్లాడితే వచ్చేది ఏమీ లేదని తెలిసిపోయిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. మౌనంగా ఉండడమే శ్రేయస్కరమనే నిర్ణయానికి వచ్చానని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యుడు జి. వెంకటస్వామి తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంకటస్వామితో గతంలో జరిగిన అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
కాంగ్రెసులో సీనియర్ కావడానికి మాజీ పిసిసి అధ్యక్షుడో, మాజీ ముఖ్యమంత్రో అయి ఉండాలని ఆయన అన్నారు. రాజకీయాల్లో 50 ఏళ్ల అనుభవం ఉన్న తాను సీనియరును కానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
