కూలిన ట్యాంక్: శిథిలాల కింద ఇద్దరు
హైదరాబాద్: వరంగల్ జిల్లా జనగామ మున్సిపాలిటీలో వాటర్ ట్యాంక్ కూలింది. శిథిలాల కింద ఇద్దరు కూలీలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అయితే, అందుకు సంబంధించిన ఆనవాళ్లు మాత్రం కనిపించడం లేదు. శిథిలాల కింది నుంచి అరుపులు వినిపిస్తున్నాయని, అందువల్ల కూలీలు శిథిలాల కింద ఉండవచ్చునని అంటున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
పాత వాటర్ ట్యాంక్ కూల్చి కొత్త ట్యాంక్ ను నిర్మించే ప్రయత్నాలను మునిసిపాలిటీ ప్రారంభించింది. పాత ట్యాంక్ పైభాగాన్ని కూల్చివేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలింది. దీంతో కింద పనిచేస్తున్న కూలీలు శిథిలాల కింద పడి ఉంటారని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications