యాసిడ్ దాడి: శ్రీనివాస్ అరెస్టు
వరంగల్: వరంగల్ జిల్లా హసన్ పర్తి కిట్స్ కళాశాల ఇంజినీరింగ్ విద్యార్థినులు స్వప్నిక, ప్రణీతలపై దాడి చేశాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న శ్రీనివాస్ ను పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేశారు. అతన్ని పోలీసులు ముమ్మూరు సమీపంలోని నక్కపల్లి వద్ద అరెస్టు చేశారు. దాడి చేసింది తాను కాదని శ్రీనివాస్ అంటున్నాడు. శ్రీనివాస్ తరఫున కోర్టులో ఎవరూ వాదించకూడదని బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. మహిళా సంఘాలు పెద్ద యెత్తున నిరసన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థి సంఘం పిడిఎస్ యు బంద్ కు పిలుపునిచ్చింది.
కాగా, అపార్ట్ మెంటు నిర్మాణం విషయంలో స్వప్నిక, శ్రీనివాస్ కుటుంబాల మధ్య ఇప్పటికే వివాదం ఉంది. ఇది వరకు ఒక్కసారి ఈ వివాదంలో శ్రీనివాస్ స్వప్నిక తండ్రి దేవేందర్ స్కూటర్ ను దగ్ధం చేశాడు. దీనిపై పోలీసు స్టేషనులో కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసుతో పాటు స్వప్నిక తన ప్రేమను నిరాకరిస్తుండడంతో శ్రీనివాస్ యాసిడ్ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. యాసిడ్ దాడిలో శ్రీనివాస్ కు సహకరించారని భావిస్తున్న మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications