పాలవ్యాన్ ను ఢీకొట్టిన ఎక్సుప్రెస్ రైలు
నల్గొండ: సికింద్రాబాద్‌నుంచి విశాఖ వెళుతున్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ గురువారం ఉదయం ఓ పాల వ్యాన్‌ను ఢీకొనటంతో తృటిలో ప్రమాదం తప్పింది. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం నాతాళ్లగూడెం వద్ద ఈ సంఘటన జరిగింది. రైలు ఢీకొనటంతో వ్యాను డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు రైలును నిలిపివేశారు.
పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో రెచ్చిపోయిన కొందరు వారిపై రాళ్లు రువ్వారు. పోలీసులు లాఠీఛార్జి చేసి వారిని చెదరగొట్టారు. ఇక్కడ రైల్వేక్రాసింగ్ నిర్మించాలని ఎంతో కాలంగా ప్రజలు కోరుతున్నా ఎవరూ పట్టించుకోకపోవటంతో తరచు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications