మాగంటి బాబా, మజాకా...
తాడేపల్లిగూడెం: రాష్ట్ర మంత్రి మాగంటి బాబు మరోసారి తన ప్రతాపాన్ని చూపారు. కొత్త కొత్త కార్యక్రమాలతో అందరినీ ఆకర్షించే ఆయన ఈసారి ఏకంగా రైల్వే ట్రాకుపై కారు నడిపి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తాడేపల్లి గూడెంలో ఆయన రెండు రైల్వే ట్రాకులపై నుంచి కారు నడుపుకుంటూ ఏకంగా మూడో నెంబరు ప్లాట్ ఫారంపైకి దూసుకొచ్చారు. మంత్రిగారి కారును చూసి ప్రయాణికులు విస్తుపోయారు.
ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ను రైలు ఎక్కించడానికి ఆయన ఈ సాహసానికి పూనుకున్నారు. మంత్రిగారు అలా ఏకంగా రైల్వే ట్రాకుపై నుంచి కారును నడుపుతూ ప్లాట్ ఫారంపైకి రావడం తప్పేనని అంటూనే రైల్వే అధికారులు అక్కడి నుంచి చల్లగా తప్పుకున్నారు. మంత్రిగారు నిబంధనలు ఉల్లంఘించి కారును ప్లాట్ ఫారం మీది దాకా నడుపుకుంటూ రావడాన్ని ప్రయాణికులు తప్పు పడుతున్నారు.












Click it and Unblock the Notifications