యువతి చేతులు నరికిన ఉన్మాది
అనంతపురం: స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి వ్యవహారం రగులుతుండగానే అనంతపురం జిల్లాలో శుక్రవారం మరో ఘోరం జరిగింది. ఒక ప్రమోన్మాది యువతి చేతులు నరికి, గొంతు కోశాడు. తన కోరిక తీర్చలేదనే అక్కసుతో మహదేవనప్ప అనే యువకుడు గాయత్రి అనే వివాహిత చేతులు, నరికి గొంతు కోశాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా హిందూపురం మండలం గోలాపురం గ్రామంలో జరిగింది. యువతిని ఆస్పత్రికి చేర్చారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మహదేవనప్ప పరారీలో ఉన్నాడు.
తెలిసిన వివరాల ప్రకారం: మహదేవనప్ప గాయత్రిని చాలా కాలంగా ప్రేమిస్తున్నాడు. ఆమె అతని ప్రేమను నిరాకరించి మరో పెళ్లి చేసుకుంది. గాయత్రి భర్త మహదేవనప్ప మిత్రులు. దీంతో గాయత్రిపై మహదేవనప్ప పగ పెంచుకున్నాడు. పెళ్లయిన తర్వాత కూడా ఆమెను వదిలిపెట్టలేదు. చివరకు తన కోరిక తీర్చాలని వెంట పడ్డాడు. అందుకు ఆమె నిరాకరించడంతో అతను వేట కొడవలితో ఆమె చేతులు నరికి గొంతు కోశాడు. గాయత్రికి పాప కూడా ఉంది.












Click it and Unblock the Notifications