Heatwave: ఏపీలో రేపటి నుంచి ఈ జిల్లాల్లో భగభగలే..! సర్కార్ హైఅలర్ట్..!
ఏపీలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం వరకూ అక్కడక్కడా వర్షాలు కురిసినా ఇవాళ పరిస్ధితి దారుణంగా మారిపోయింది. రేపటి నుంచి అయితే ఇక చెప్పాల్సిన అవసరమే ఉండదని వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేస్తోంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వడగాల్పులు (Heatwave) ఉంటాయని, ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీలకు చేరుకోవడం ఖాయమని తెలిపింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, నగర పంచాయతీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో తీరప్రాంత జిల్లాల్లో వడగాలులు తీవ్రం కానున్నట్లు ప్రభుత్వం పట్టణ స్దానిక సంస్ధలకు జారీ చేసిన హైఅలర్ట్ లో పేర్కొంది. రేపటి (మే 20) నుండి ఈనెల 26 వరకు వడగాలులు తీవ్రంగా ఉంటాయని అంచనా వేసింది. ముఖ్యంగా మధ్య, ఉత్తర కోస్తా జిల్లాల మున్సిపల్ అధికారులు అలర్ట్‌గా ఉండాలని ఆదేశించింది. వడగాలుల ముప్పుపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని ఆదేశించింది. బస్ స్టాండ్లు, మార్కెట్లు, అన్నా క్యాంటీన్ల దగ్గర తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించింది.

ఎండలు ఎక్కువగా ఉన్న చోట్ల చలివేంద్రాలు, శీతలీకరణ షెల్టర్లు ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే పగటి వేళల్లో మున్సిపల్ పనులను నిలిపివేయాలని తెలిపింది. పారిశుధ్య కార్మికులు, కూలీలు, వీధి వ్యాపారులు, వృద్ధుల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించింది. పట్టణాల్లో తాగునీటి సరఫరాకు, పారిశుధ్య పనులకు ఎలాంటి అంతరాయం కలగకూడదని ఆదేశాల్లో పేర్కొంది. ప్రజల అత్యవసర సేవలు, ఫిర్యాదుల కోసం మున్సిపల్ కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు చేయాలని కోరింది. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను ప్రతిరోజూ మున్సిపల్ కమిషనర్లు స్వయంగా పరిశీలించాలని,
ఎండ దెబ్బకు ఎవరూ ఇబ్బంది పడకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications