మళ్లీ మోడీ ముందుకు నార్వే మహిళా జర్నలిస్ట్- ఇవాళ ఏం జరిగిందంటే ?
ప్రధాని మోడీ తన యూరప్ టూర్ లో భాగంగా నార్వేలో పర్యటిస్తున్నారు. ఓస్లోలో పర్యటిస్తున్న ప్రధాని మోడీ అక్కడి ప్రధానితో కలిసి ఉమ్మడిగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నిన్న ఇలాగే జరిగిన ఓ ఈవెంట్ లో స్థానిక మీడియా అడిగిన ప్రశ్నలకు ప్రధాని మోడీ సమాధానం ఇవ్వకుండానే వెళ్లిపోయారు. దీంతో తమ దేశంలో మీడియా స్వేచ్ఛ ఉందని చెప్పుకునే ప్రధాని.. ఇలా మీడియా స్వేచ్ఛలో ప్రథమ స్ధానంలో ఉన్న నార్వేలో తమ ప్రశ్నకు స్పందించకపోవడం ఏంటని అక్కడి మహిళా జర్నలిస్ట్ హెల్లె లింగ్ (Helle Lyng) ప్రశ్నించారు. దీంతో భారత్ లో ఆమెపై తీవ్ర చర్చ జరుగుతోంది. దీనిపై కేంద్రం స్పందించింది.
భారత్ లో పత్రికా స్వేచ్ఛ, మానవ హక్కులపై నార్వే జర్నలిస్ట్ హెల్లే లింగ్ అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ.. మనం ప్రపంచ మొత్తం జనాభాలో ఆరో వంతు ఉన్నాం, కానీ ప్రపంచ సమస్యలలో ఆరో వంతు మనవి కావని తెలిపింది. ప్రజల ప్రాథమిక హక్కులకు హామీ ఇచ్చే రాజ్యాంగం మనకు ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (పశ్చిమ) సిబి జార్జ్ పేర్కొన్నారు. 'భారతదేశాన్ని ఎందుకు విశ్వసించాలి?' అని నార్వే జర్నలిస్ట్ హెలె లింగ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా... భారత రాజ్యాంగం పౌరులందరికీ ప్రాథమిక హక్కులకు హామీ ఇస్తుందని, ఆ హక్కుల ఉల్లంఘనలకు చట్టపరమైన పరిష్కారాలను అందిస్తుందని తెలిపారు.

At this event today. Just for your information: I had no problems entering here today and was not expecting to have it either. Business as usual here in Norway. pic.twitter.com/i0VHghnLsH
— Helle Lyng (@HelleLyngSvends) May 19, 2026
ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ప్రధాని మోడీ అక్కడి ప్రధానితో కలిసి మరో ఈవెంట్ లో పాల్గొన్నారు. నిన్నటి ఘటన తర్వాత కూడా ఇవాళ సదరు జర్నలిస్ట్ హెల్లె లింగ్ కు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ కార్యక్రమానికి ప్రభుత్వం ఆహ్వానించింది. దీంతో ఆమె కూడా అక్కడికి వెళ్లింది. అంతే కాదు నిన్నటి ఘటన తర్వాత ఇవాళ ఏదో జరిగిపోతుందని భావించిన వారికి షాకిచ్చింది. ఈరోజు ఈ కార్యక్రమంలో, మీ సమాచారం కోసం అంటూ ఈరోజు ఇక్కడికి ప్రవేశించడంలో నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదు, ఎదురవుతాయని నేను ఊహించలేదు కూడా, నార్వేలో అంతా మామూలుగానే ఉందని ఆమె తెలిపింది. దీంతో వివాదం సద్దుమణిగినట్లయింది.














Click it and Unblock the Notifications