చంద్రబాబుతోనే కెసిఆర్

కెసిఆర్ రేపో, ఎల్లుండో ఢిల్లీకి వెళ్లి వచ్చిన అనంతరం ఈ నెల 21వ తేదీన తెలుగుదేశంతో పొత్తు విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీకి తెలంగాణలో అంత ఆదరణ లేదని, పార్టీలో కూడా అసంతృప్తి నెలకొని ఉందని, ఈ స్థితిలో ప్రజారాజ్యంతో కలిసి పని చేయడం వల్ల ఉపయోగం ఉండదని కెసిఆర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం, వామపక్షాల కూటమి బలంగా ఉందని, కాంగ్రెసు పార్టీని ఓడించడం ఈ కూటమి వల్లనే సాధ్యమవుతుందని ఆయన అంచనా వేస్తున్నట్లు చెబుతున్నారు. దీని వల్ల తెలుగుదేశం, వామపక్షాల కూటమి వెంట ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications