వైయస్ తో మందకృష్ణ భేటీ
హైదరాబాద్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగ సోమవారం ఉదయం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని కలిశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఈ పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లు ప్రతిపాదింపజేయడానికి ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీ వెళ్లాలని కోరడానికి తాము వచ్చామని మందకృష్ణ భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాను ఢిల్లీ వెళ్తానని ముఖ్యమంత్రి చెప్పినట్లు ఆయన తెలిపారు.
ఈ నెల 23వ తేదీన పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్నందున, ఎన్నికల లోపు మళ్లీ పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశాలు లేనందున ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రతిపాదించాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం మందకృష్ణ సోమవారం మధ్యాహ్నం ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లినా బిల్లును ప్రతిపాదించే వరకు తమ పోరాటం సాగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications