భార్గవిది హత్యా, ఆత్మహత్యా?

వారిద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే భార్గవిని హత్య చేసి బుజ్జి ఆత్మహత్య చేసుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుజ్జి నోటి నుండి నురగలు వెలువడ్డాయి. భార్గవి సోమవారం అష్టాచెమ్మా సినిమా విజయోత్సవ సభకు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆమె వెళ్లలేదు. మంగళవారం ఉదయం ఎస్ఎస్ కుమార్ దర్శకత్వంలోని సినిమా షూటింగ్ కు వెళ్లాల్సి ఉంది. తన కోసం వచ్చిన సినీ సిబ్బంది వాహనంలో ఎక్కడానికి కిందికి వచ్చిన భార్గవి నగలు మరిచిపోయానంటూ పైకి వెళ్లిందని, ఎంతకీ ఆమె తిరిగి రాకపోవడంతో సిబ్బంది పైకి వెళ్లి చూశారు. రెండు శవాలు మంచంపై పడి ఉండడంతో వారు ఎస్ఎస్ కుమార్ కు చెప్పారు.












Click it and Unblock the Notifications