హైదరాబాద్: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సోమవారం పటాన్‌చెరులో బహిరంగసభలో పాల్గొంటున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ పార్టీ నేత కోటగిరి విద్యాధరరావు ఈరోజు ఏర్పాట్లను సమీక్షించారు. సభకు భారీ జనం వచ్చినా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అవినీతి అధికారి సూర్యనారాయణ వెనుక ప్రభుత్వపెద్దలకు వాటాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. చిరంజీవి సభలకు మొదట తెలంగాణలో స్పందన తక్కువగా ఉన్నప్పటికీ క్రమంగా జనం స్వచ్చందంగా ఆయన సభలకు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు.