హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను సోమవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రబంద్‌లో భాగంగా హైదరాబాద్‌లోని విద్యానగర్ చౌరస్తాలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి మంద కృష్ణమాదిగ నేతృత్వం వహించారు. ట్రాఫిక్ భారీగా స్థంభించింది. దీంతో పోలీసులు మంద కృష్ణను, పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. అంతకు ముందు మందకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ ాష్ట్రవ్యాప్తంగా తమ కార్యకర్తలు శాంతియుతంగా బంద్ చేస్తున్నారని దీన్నికూడా అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ హెచ్చరించారు. నల్లకుంటలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్సీల వర్గీకరణపై ఇక తాము ప్రభుత్వానికి ఎలాంటి విజ్ఞప్తులు చేయమని ఎవరినీ కలవమని స్పష్టం చేశారు.