9 మంది టీఅర్ ఎస్ ఎమ్మెల్యేలకు అనర్హత
హైదరాబాద్: తొమ్మిది మంది తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలపై స్పీకర్ సురేష్ రెడ్డి సోమవారం అనర్హత వేటు వేశారు. ఆరుగురు రాజీనామా చేసినప్పటికీ వారిని కూడా నిబంధన ప్రకారం శాసనసభ్యత్వం నుంచి తొలగించవలసి వచ్చిందని స్పీకర్ చెప్పారు. ఇది దేశంలోనే అరుదైన కేసు అని ఆయన చెప్పారు. ఇరువైపుల వాదనలు వినడానికి చాలా సమయం పట్టిందని ఆయన అన్నారు.
అంతకు ముందు తెరాస అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించరాదంటూ తెలంగాణా రాష్ట్ర సమితి నేతలు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, నాయని నర్సింహారెడ్డిలు ఈరోజు ఉదయం స్పీకర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. వీరి రాజీనామాలు కాంగ్రెస్ ఆడిస్తున్న డ్రామాగా వారు అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలు వేటు భయంతో రాజీనామాలు చేశారని వారు ఆరోపించారు. స్పీకర్ నిర్ణయం తరువాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు.












Click it and Unblock the Notifications