స్పీకర్ ఇంటి వద్ద తెరాస ఆందోళన

అసమ్మతి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రడ్డి తొత్తులుగా మారారని ఆరోపించారు. ఈ ఆందోళనలో తెరాస శాసనసభ్యులు హరీష్ రావు, రాజేందర్, నాయకులు నాయని నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీసులు వీరందరినీ అరెస్టు చేశారు. తెరాస నేతలు హరీష్‌రావు, ఈటెల రాజేందర్, నాయని నర్సింహారెడ్డిలు అక్కడికి వచ్చి స్పీకర్ లేరని తెలుసుకుని సెంట్రీ కానిస్టేబుల్‌కు వినతిపత్రం ఇచ్చి వెళ్లారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విప్ ను ధిక్కరించి 9 మంది తెరాస అసమ్మతి శాసనసభ్యులు కాసాని జ్ఞానేశ్వర్ కు ఓటేశారు. దీనిపై తెరాస స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని వారు స్పీకరును కోరారు. అయితే గత ఐదు నెలలుగా స్పీకర్ విచారణ జరుపుతూ నిర్ణయం తీసుకోవడం లేదు. తాజాగా అసమ్మతి శాసనసభ్యులు రాజీనామాలకు దిగారు. వారి రాజీనామాలను ఆమోదించకుండా వారిని అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ తెరాస ఆందోళనకు దిగింది.












Click it and Unblock the Notifications