• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబు హైటెక్ లైన్, ఫండ్స్ కై ఆన్ లైన్

By Staff
|

హైదరాబాద్‌: రాజకీయాల్లో పారదర్శకతకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇందుకు మళ్లీ హైటెక్‌ బాట పట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆలంబనగా మార్చుకున్నారు. రాజకీయ కార్యకలాపాల నిర్వహణకు ప్రజల నుంచి పారదర్శకంగా విరాళాలు సేకరించాలని టీడీపీ నిర్ణయించింది. రూ.ఐదు నుంచి ఎంతయినా విరాళాలను ఆన్‌లైన్‌ ద్వారా ఇవ్వడానికి వీలుగా వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం ఎన్టీఆర్‌ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో దీనిని ప్రారంభించారు. ఠీఠీఠీ. ్ట్ఛజూఠజఠఛ్ఛీట్చఝ.ౌటజ నుంచి చెల్లింపులు చేయడానికి అవకాశం కల్పించారు. క్రెడిట్‌, డెబిట్‌, ఐటీజడ్‌ క్యాష్‌ కార్డులు, మొబైల్‌ పేమెంట్‌ తదితర మార్గాల ద్వారా ఈ చెల్లింపులు జరపవచ్చు. ప్రస్తుతం భారతీయులు మాత్రమే దీనిద్వారా చెల్లింపులకు అర్హులు. విదేశాల్లో ఉన్నవారు చెల్లింపులు చేయడానికి ఇంకా అనుమతి ఇవ్వలేదు. రూ.20 వేలకు మించి చెల్లింపులు చేసేవారు పాన్‌కార్డు నెంబర్‌ను పేర్కొనాల్సి ఉంటుంది. విరాళాలు ఇచ్చినవారికి ఆదాయపు పన్ను రాయితీ కూడా లభిస్తుంది. దీని ద్వారా వచ్చే విరాళాలను పారదర్శకంగా ఉంచుతామని, ఖర్చులు కూడా బహిరంగంగానే వెల్లడిస్తామని బాబు తెలిపారు. "రాజకీయాన్ని కాంగ్రెస్‌ వ్యాపారంగా మార్చింది. గత ఎన్నికల్లో అప్పులు చేసి పోటీచేసిన కాంగ్రెస్‌ నేతలు నాలుగేళ్లలోనే కోటీశ్వరులయ్యారు. రోజుకో ఎలుగుబంటి బయటకు వస్తోంది. ముఖ్యమంత్రి, ఆయన అనుయాయులు రాజకీయాలను కలుషితం చేశారు. దానికి భిన్నంగా స్వచ్ఛమైన రాజకీయ సంస్కృతిని తీసుకొచ్చేందుకు ప్రజల నుంచే విరాళాలు సేకరించాలని నిర్ణయించాం. ప్రస్తుతం నైతిక విలువలతో కూడిన రాజకీయాలు కావాలి. రూ.100 దోచుకుని అందులో రూ.10 పంచిపెట్టి చాలా చేసినట్లు మభ్యపెట్టాలని కాంగ్రెస్‌ నేతలు చూస్తున్నారు. వివిధ వర్గాల ప్రజల్లోకి నేరుగా వెళ్లి ఈ విషయాలను వివరిస్తాం. ఓటుతోపాటు నోటు మా నినాదం'' అని ఆయన చెప్పారు. టికెట్‌ హామీ ఇస్తే విరాళాలు బాగా వస్తాయేమోనని ఒక విలేకరి వ్యాఖ్యానించగా.. టికెట్లు అమ్ముకోవాలనుకొంటే ఈ ప్రయత్న మే అవసరం లేదని, ఆ పనిలో వేరే పార్టీలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ అసమ్మతి ఎమ్మెల్యేల విషయంలో తన అసంబద్ధ నిర్ణయంతో స్పీకర్‌ తన గౌరవాన్ని పోగొట్టుకొన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టీడీపీ అసమ్మతి ఎమ్మెల్యే వీరశివారెడ్డిపై తమ ఫిర్యాదును చాలాకాలం క్రితమే స్పీకర్‌కు ఇచ్చామని, ఫిర్యాదు అందలేదని చెప్పడం వాస్తవం కాదని స్పష్టం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X