పోరాటం ఆపకు..గద్దర్

'టీడీపీ, సీపీఐ, పీఆర్‌పీ... ఇలా అందరూ తెలంగాణకు జై అనడం వల్ల ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమ తీవ్రత తగ్గే ప్రమాదం ఉందని ప్రజాగాయకుడు గద్దర్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ చరిత్రాత్మక పాత్ర పోషించి తెలంగాణ నిప్పురవ్వను ఆరకుండా చూసుకోవాలని విజ్ఞప్తిచేశారు. తుది వరకు పోరాడాలని.. దానికి తాను పాటగా, బాసటగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.
అలాగే శాంతి చర్చలకు తాను తీసుకొచ్చిన 85 మంది నక్సల్స్‌లో ఐదుగురు మాత్రమే మిగిలారని, 80 మందిని కాల్చిచంపేశారని మండిపడ్డారు. తెలంగాణ ఇస్తానని ఇవ్వకుండా మరో మోసం చేసిందని దుయ్యబట్టారు. 'మా భూములు, నీళ్లు, ఉద్యోగాలు, వనరులు, స్వాభిమానం, మా తెలంగాణ మాకు కావాలని ఉద్యమించాలి. తెలంగాణ కావాలో వద్దో తల్లిదండ్రుల కాళ్లు పట్టుకుని ప్రశ్నించండి' అని విద్యార్థులను కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన అమరవీరులకు జోహార్లు చెబుతూ గద్దర్ పాట పాడారు.












Click it and Unblock the Notifications