రోడ్ షోలపై నిషేధం ఎత్తేసిన కోర్టు
హైదరాబాద్: రాజకీయ పార్టీల రోడ్ షోలపై స్టేను రాష్ట్ర హైకోర్టు నేడు తొలగించింది. రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (డిజిపి) రూపొందించిన నిబంధనలకు లోబడి రోడ్ షోలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. గతంలో వీటిపై విధించిన స్టేను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ నిబంధనలమేరకు వీటిని నిర్వహించుకోవచ్చని అనుమతి ఇచ్చింది.
రోడ్‌షోల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యంపై గతంలో విచారించిన హైకోర్టు వీటిపై స్టే ఇచ్చింది. వివిధ పార్టీలవారు, ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరింది. వాటిని పరిశీలించిన అనంతరం ఈరోజు స్టే ఎత్తివేసింది. రోడ్ షోలపై నిషేధం ఎత్తివేయడం చిరంజీవికి ఉపకరించనుంది. ఆయన రోడ్ షోల ద్వారా అన్ని పట్టణాలను సందర్శించి జనంతో ప్రత్యక్షం ఇంటరాక్ట్ అవుతున్న సమయంలో హైకోర్టు రోడ్ షోలు నిర్వహించరాదంటూ స్టే ఇచ్చింది.












Click it and Unblock the Notifications