ఢాకా: అవినీతికి ఆలవాలంగా మారిన బంగ్లాదేశ్ రాజకీయాలలో యువశక్తి ఈసారి ప్రధానపాత్ర నిర్విహించింది. ఏడేళ్ళ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బంగ్లాదేశ్ ప్రజలు షేక్ హజీనాకు బ్రహ్మరథం పట్టారు. మొత్తం 300 స్థానాలలో హసీనా నాయకత్వంలోని మిత్ర పక్ష కూటమికి మొత్తం 258 సీట్లు లభించాయి. ఈ ఘన విజయాన్ని ఆమె సైతం ఊహించలేదు. ఆమెకు సమీప ప్రత్యర్ధిగా నిలిచిన ఖలీదా బేగమ్ ఘోర పరాజయాన్ని చవి చూడవలసి వచ్చింది. . ఇక ఈ గెలపు కారణంగా నిలిచిన యువతీ యువకులు భారీ ఎత్తున వీదులలోకి వచ్చి హసీనా నాయకత్వాన్ని బలపరుస్తూ పెద్ద ఎత్తున ఊరేగింపులు నిర్వహించారు. అలాగే వారంతా ఓటర్ల ఇళ్ళకు వెళ్ళి మరీ హసీనా నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రచారం సాగించారు.