మద్దెలచెరువు సూరి నిమ్స్ కి
హైదరాబాద్ : పరిటాలరవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దెలచెరువు సూరి కొంతకాలంగా వెన్నునొప్పి, రక్తపోటులతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇంతవరకు పరీక్షలు చేసే కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఎంఆర్‌ఐ పరీక్షల యంత్రాలు లేకపోవడంతో వైద్యులు నిమ్స్‌కు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దాంతో ఆయన్ని వైద్య పరీక్షల నిమిత్తం గురువారం అనంతపురం జిల్లా రెడ్డిపల్లి జైలు నుంచి నిమ్స్‌కు తీసుకొచ్చారు. గురువారం నిమ్స్‌లో అత్యవసర వైద్య చికిత్సల విభాగంలో చేర్చారు. ఈసీజీ తదితర పరీక్షలు చేశాక మిలీనియం బ్లాక్‌లోని మూడో అంతస్తులోని 320 గదికి మార్చారు. దీంతోపాటు 318వ నంబరు గదినీ ఆయనకు ఇచ్చారు.












Click it and Unblock the Notifications