పవన్ పై కోర్టుకు వెళ్లొచ్చు:చిరంజీవి

కాంగ్రెస్ నేతలు కూడా రక్తవ్యాపారి అంటూ తనపై వ్యక్తిగత విమర్శలు చేశారని.. తామేమీ వారిపై దాడికి వెళ్లలేదన్నారు. పార్టీలోని మిగిలిన నేతలూ పనిగట్టుకుని పవన్‌కల్యాణ్‌లా మాట్లాడాలని తాను చెప్పబోనని.. అందుకు స్ట్రిప్టు ఇవ్వబోనని, ఎవరి శైలి వారికి ఉంటుందని తెలిపారు.
ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ఎవరికి తోచిన విధంగా వారు ప్రజల మనసులో నాటుకునే విధంగా చెప్పవచ్చునని తెలిపారు. 'బీజేపీతో కలిసే ఆలోచనే లేదు. అలా కలవాలని మీరే కోరుకుంటున్నారు' అని మీడియానుద్దేశించి వ్యాఖ్యానించారు. నిజాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని కాంగ్రెస్ నేత గోనె ప్రకాశరావుకు హితవు పలికారు. ఇక జీవిత వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరిస్తూ.. ఆమె చాలా చిన్నదన్నారు.












Click it and Unblock the Notifications