నల్లగొండ: ఇది రాక్షస రాజ్యం ... హిట్లర్ రాజ్యం... అంటూ పీఆర్పీపీ నేత నాగబాబు కాంగ్రెస్ కార్యకర్తల దాడి పై తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది ప్రజాస్వా మ్యమేనా..? అంటూ ఆయన ప్రభుత్వాన్ని విమర్శించారు. నార్కట్‌పల్లి మండలం చౌడంపల్లి శివారులోని ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో బాధితులను కలుసుకునేందుకు ఆయన వచ్చారు. అక్కడ బాధిత రైతులను పరామర్శించారు. అనంతరం స్పందిస్తూ తమ పార్టీ పూర్తి న్యాయం జరిగే వరకు అండగా ఉం టుందని చెప్పారు. అనంతరం కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను నాగబాబు పరామర్శించారు.