హైదరాబాద్:పవన్ నటనను,డ్యాన్స్‌ను ప్రజలు ఇష్టపడినా అతని భాషను ఇష్టపడరని ఏఐసీసీ అధికార ప్రతినిధి కె.కేశవరావు వ్యాఖ్యానించారు. అయినా కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్లుంది యువరాజ్యం అధినేత పవన్ కల్యాణ్ వైఖరి అని ఆయన అన్నారు.అసలు తాను పవన్ వ్యాఖ్యలపై స్పందించడం సబబు కాదని చెబుతూనే.. అతన్ని విమర్శించడం లేదని, తనకు తమ్మునిలాంటి వ్యక్తి అని, భాష మార్చుకుంటే బాగుంటుందని మాత్రమే ఆయనకు సూచిస్తున్నానని అన్నారు.గాంధీభవన్లో కేశవరావు మీడియాతో మాట్లాడారు.రాబోయే ఎన్నికల్లో 70 ఏళ్లు దాటిన వృద్ధులకు టికెట్లు కేటాయించేది లేదన్న వైఎస్ వ్యాఖ్యలపై స్పందించేందుకు కేశవరావు నిరాకరించారు.