హైదరాబాద్: దర్శకుడు, రచయిత, నిర్మాత,నటుడు పోసాని కృష్ణమురళీ శనివారం పీఆర్పీ పార్టీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి సమక్షంలో ఆయన చేరిక జరిగింది. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ విధివిధానాలు నచ్చాయని, అందుకే ఆ పార్టీలోకి చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.తన వంతు పార్టీ అభివృద్ధికి, రాష్ట్ర ప్రజలకు అంకిత భావంతో సేవ చేస్తానని అన్నారు. మా అమ్మా నాన్మలను ఎంతో ఇష్టపడతానో పీఆర్పీనీ అంతే ఇష్టపడతానని పోసాని పేర్కొన్నారు.