గన్నవరం నుంచే పోటీ.. వంశీ

విజయవాడ : రానున్న ఎన్నికల్లో గన్నవరం నియోజక వర్గం నుంచే పోటీ చేస్తానని తెలుగుదేశం పార్టీ నాయకుడు డాక్టర్‌ వల్లభనేని వంశీ చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా నందమూరు ఎం.పి.టి.సికి జరిగిన ఎన్నికల్లో వంశీ తరుపున నిలబడిన అనగాని వెంకట మునేశ్వరరావు గెలుపొందారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ఆయన తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ నందమూరిలో తన అభ్యర్థి గెలుపు ప్రజా విజయంగా అభివర్ణించారు.

ఈ ప్రకటనతో తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు సృష్టించిన కృష్ణాజిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి వ్యవహారం మలుపు తిరగబోతోందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు, వల్లభనేని వంశీమోహన్‌ టీడీపీ టిక్కెట్‌ ఆశిస్తున్న విషయం తెలిసిందే. బాలవర్ధనరావుకు నందమూరి హరికృష్ణ, కళ్యాణ్‌రామ్‌ మద్దతిస్తుండగా వల్లభనేని వంశీమోహన్‌కు జూనియర్‌ ఎన్‌టిఆర్‌ మద్దతిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యువగర్జనకు ఎన్‌టిఆర్‌ గైర్హాజరు అవడానికి ఈ నియోజకవర్గ అభ్యర్ధిత్వంలో నాన్పుడు వ్యవహారమే కారణమనే అప్పట్లో ప్రచారం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+