అభివృధ్ధి ఎవరు చేసారు? వైఎస్‌

YS Rajasekhar Reddy
రాజమండ్రి :మహిళా సాధికారిత మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన డ్వాక్రా సంఘాల మహిళా సదస్సులో ఆయన పాల్గొన్నారు. మహిళా ఆభివృద్ది కోసం సంఘటితంగా ఏ పని చేయడానికైన సిద్ధంగా వున్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలో అత్యంత అగ్ర జిల్లాలైన ఉభయ గోదావరి జిల్లాలో మహిళలు సాధికారితను సాధించారని చెప్పారు.

అలాగే గోదావరి జిల్లాల డ్వాక్రా మహిళల క్రమశిక్షణ దేశానికే ఆదర్శమని ఆయన అన్నారు. రాష్ట్రంలో డ్వాక్రామహిళలకు ఈ ఒక్క ఏడాదిలోనే పదకొండు వేల ఐదువందల కోట్లరూపాయలను రుణంగా పంపిణీ చేస్తున్నట్టు ఆయన తెలిపారు. గోదావరి జిల్లాల డ్రాక్రామహిళల క్రమశిక్షణ దేశానికే ఆదర్శమన్నారు. ప్రతి పేద ఇంటి పిల్లలు ఇంజనీరింగ్‌, వైద్య చదువులు చదివేందుకు వీలుగా ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తుందని తెలిపారు. పావలా వడ్డీ రుణాలతో మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందుతున్నారని ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్‌ గత నాలుగున్నర సంవత్సరాలుగా చేసిన,చేస్తున్న అభివృద్ధిని ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదని ఆయన అన్నారు.ఆయన శనివారం తూర్పుగోదావరి జిల్లాలో ద్వారపూడిలో సుమారు రూ.33 కోట్లతో నిర్మించే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం వైఎస్‌ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+