ఐటీ సంస్ధల మీద ఉగ్రవాదుల కన్ను
బెంగళూరు : దేశ ఐటీరాజధానిపై ఉగ్రవాదులు దాడి చేయవచ్చనే నిఘావర్గాల సమాచారంతో నగరంలోని అన్నీ ఐటీ సంస్థల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేస్తున్నట్టు బెంగుళూరు పోలీసులు తెలిపారు. ఇన్ఫోసిస్, విప్రో... తదితర కంపెనీలకు కొన్ని బెదిరింపు మెయిళ్లు అందాయని వాటిపై కూడా విచారణ చేస్తున్నట్టు నగర సంయుక్త కమిషనర్ గోపాల్ హసూర్ తెలిపారు.
గత ఏడాది కోరమంగళ, హోసూర్ పరిసరాల్లో తీవ్రవాదులు బాంబులు పేల్చిన విషయం విదితమే. ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ రాజధాని అయిన బెంగళూరును దెబ్బతీయాలని తీవ్రవాదులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం ప్రభుత్వం వద్ద ఉంది.












Click it and Unblock the Notifications