హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రపతే షాక్ అయ్యారు:బాబు

By Staff
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్:రూ.250కోట్ల ఆదాయాన్ని మత్స్యశాఖ కార్యనిర్వహక ఇంజనీరు వెలుగుబంటి సూర్యనారాయణ సమకూర్చుకున్నారని, ఆయన అక్రమార్జన వెనక రాష్ట్ర ప్రభుత్వంలోని ఆరుగురు మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం పాత్ర కూడా ఉందన్నారు. దీనిపై సమగ్రంగా రాష్ట్రపతికి వివరించామన్నారు.దీంతో ఆమె రాష్ట్రంలో ఇంత జరుగుతోందా అని ఆశ్చర్యపోయారన్నారు. మొత్తం సంఘటనలో రాష్ట్రపతి జోక్యాన్ని కోరాం. ఈ అవినీతి, అక్రమాల ప్రభుత్వ భరతం పడ్తాం అని బాబు పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ఒక్కక్కిటిగా వివరిస్తుంటే రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ కూడా ఆశ్చర్య పోయారని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. సీపీఎం, సీపీఐ, తెరాసల నాయకులతో కల్సి సోమవారం ఆయన రాష్ట్రపతిని కలిశారు. అనంతరం తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు నివాశంలో మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వ పెంకి, రంకు, బొంకుతనాన్ని ఎండగట్టేందుకు భవిష్యత్‌లో పూర్తిస్థాయిలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. రాష్ట్రపతి ముందు రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పుస్తకాన్ని ఉంచామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. ''ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నా.. ఎవరిపై ఎలాంటి చర్యలు, కనీసం విచారణ కూడా జరిపించని సంఘటన ఎక్కడైనా చూశారా అని రాష్ట్రపతిని ప్రశ్నించాం'' అని తెలిపారు. పీఎం రాష్ట్రకార్యదర్శి బి.వి.రాఘవులు మాట్లాడుతూ కాంగ్రెస్‌ అవినీతిపాలనపై స్పందించాలని రాష్ట్రపతిని కోరామన్నారు. తెదేపా, తెరాస, సీపీఐ, సీపీఎంల కలయిక అవినీతి అంతానికి నాంది కాబోతోందని చెప్పారు.

సమావేశం ముగిసిన అనంతరం అందరికీ సాదరంగా వీడ్కోలు పలికారు. కేసీఆర్‌ నివాసం ముందు తొలిసారిగా వందలాదిమంది టిడిపి, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గుమికూడి జై తెలంగాణ నినాదాలివ్వటం అందరినీ ఆకర్షించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X