రెండోరోజుకు చేరిన లారీల సమ్మె
హైదరాబాద్:దేశవ్యాప్తంగా అఖిల భారత మోటార్ ట్రాన్‌సపోర్టు కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న లారీల సమ్మె రెండోరోజుకు చేరుకుంది.తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా లారీల బందును నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం తమపై ఎమర్జన్సీ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ( ఎస్మా)ను ప్రయోగించినా భయపడేదిలేదని స్పష్టం చేశారు.
ఒక్కరోజు సమ్మెతోనే కూరగాయల ధరలు పెరిగిపోయాయి.తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు గోపాల్‌నాయుడు, వైవీ ఈశ్వరరావు తెలిపారు. సోమవారం అర్థరాత్రి నుంచి ఆయిల్ ట్యాంకర్లను కూడా నిలుపుదల చేస్తున్నట్లు వారు తెలిపారు.
లారీల బందును నిలుపుదల చేసే విషయం ప్రస్తుతం కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని, ఇప్పటికే ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పేర్కొన్నారు. సమ్మెతో మధ్య తరగతి కుటుంబాలకు ఇబ్బందికరంగా మారింది. రోజువారి నిత్యవసర వస్తువుల ధరలు రెట్టింపు అయ్యాయి.












Click it and Unblock the Notifications