వందకే వంట:చిరు ప్రకటన

Chiranjeevi
నెల్లూరు: తాము అధికారంలోకి వస్తే వంద రూపాయలకే వంట సరుకులిస్తామంటూ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రకటించారు.సోమవారం రాత్రి నెల్లూరులో జరిగిన బహిరంగసభలో చిరంజీవి ఈ మేరకు ప్రకటన చేశారు. ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, సామాన్యుల కడుపునిండా తిండికిసైతం నోచుకోలేనిపరిస్థితిని చక్కదిద్దడమే ప్రరాపా ధ్యేయమని వెల్లడించారు. తన తల్లి పుట్టిన గడ్డ నుంచి ఈ హామీ ఇస్తున్నానని ప్రకటించారు. పేదరికం లేని రాజ్యాన్ని స్థాపించడం ప్రజారాజ్యం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, కిలో నూనె, కిలో ఉప్పు, కిలో చింతపండు అన్నీ కలిపి 100 రూపాయలకే తెల్లరేషన్‌కార్డు కలిగిన వారికి అందజేస్తామని విస్పష్టం గా ప్రకటించారు. రాష్ట్రంలో రెండో అభ్యర్థిగా జిల్లాకు చెందిన వ్యక్తినే ప్రజా రాజ్యం పార్టీ ప్రకటించింది. ప్రరాపా నాయకుడు, జిల్లావాసి అయిన డాక్టర్‌ పుచ్చలపల్లి మిత్రా నెల్లూరు నుంచి బరిలో ఉంటారని చిరంజీవి సోమవారం నిర్వహించిన ప్రరాపా జిల్లా కార్యవర్గ సమావేశంలో ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+