రాజు అరెస్టుకు కేంద్ర ప్రభుత్వ ఆదేశం?
న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్ సర్వీసెస్ మాజీ చైర్మన్ రామలింగరాజును అరెస్టు చేయవలసిందిగా కేంద్రప్రభుత్వం రాష్ట్ర డిజిపిని ఆదేశించినట్టు తెలుస్తోంది. సత్యం మాజీ చైర్మన్ పై సిబిసీఐడి విచారణకు ఆదేశించినట్టు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ముక్తసరిగా ప్రకటించారు. అయితే ఎవరైనా ఫిర్యాదు చేస్తే కానీ అరెస్టు చేయలేమని పోలీసు అధికారులు అంటున్నారు.
తెలుగువారికి ఎంతో ఖ్యాతి తెచ్చి పెట్టిన సత్యం కంప్యూటర్స్ సంస్ధ ఇలా అవుతుందని అనుకోలేదని రాష్ట్ర ఆర్ధిక మంత్రి రోశయ్య అన్నారు. సత్యం అనుబంధ సంస్ధలైన 104,108 లకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు ఇస్తున్న విషయం తెలిసిందే. వీటిని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించే విషయం సందేహంలో పడింది.












Click it and Unblock the Notifications