ఒంగోలు:సత్యం సంక్షోభానికి ప్రభుత్వానిదే బాధ్యత అని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి వ్యాఖ్యానించారు. ప్రజా అంకితయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు వచ్చిన ఆయన ప్రసంగిస్తూ ప్రభుత్వ నేతలు కమిషన్లు పొంది వేలాదికోట్ల రూపాయల కాంట్రాక్టుల్ని సత్యంకు అప్పగించారని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతిపై ధర్మయుద్ధం జరగాలంటే ప్రజారాజ్యానికి ఒక్కసారి అవకాశమివ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గ్రామసీమలు తీవ్రంగా నిర్లక్ష్యానికి గురికావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు నిధులు, విధులు కావాలంటే ప్రజారాజ్యంకు పట్టం కట్టాలని ఆయన కోరారు.