టెర్రరిజంపై కలిసి పోరాడుదాం:ప్రధాని

చెన్నైలో ఈరోజు నుంచి జరుగుతున్న ప్రవాసభారతీయ దివస్‌ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రవాస భారతీయుల పాత్రను ఆయన కొనియాడారు. అలాగే ఇప్పటికే ఉగ్రవాద నిర్మూలనకు కొన్ని దేశాలు మద్దతివ్వగా కెనడా కూడా మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. అలాగే గాజాపై ఇజ్రాయిల్ దాడిని ఖండించిన ప్రధాని పాలస్తీనియన్లకు సంఘీభావం ప్రకటించారు. ఈ సమావేశంలో రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌కూడా పాల్గొన్నారు.
ఇదిలాఉండగా ప్రవాసీ భారతీయ దివస్‌పై లష్కరే, ముజాహిదీన్లు దృష్టి పెట్టారని ఇంటిలిజెన్స్ వర్గాలు ద్వారా తెలియటంతో చెన్నైలో రెడ్ ఎలర్ట్ ప్రకటించారు. తీవ్రవాదుల బెదిరింపు మెయిల్స్ రావడంతో ముంబాయి దాడుల దరిమిలా ప్రవాస భారతీయ దినోత్సవాలకు భారీభద్రత కల్పించారు.












Click it and Unblock the Notifications